Breaking News

టాలీవుడ్‌లో నెపోటిజం.. ఎన్టీఆర్, మహేష్ బాబులపై నాని కామెంట్స్.. ఏదైనా ఫంక్షన్‌లో కలిస్తే!


సినిమా ఇండస్ట్రీలో అనే అంశం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్‌కి శాపంలా మారిందనే కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది నటీనటులు ఈ అంశంపై నోరువిప్పారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నానికి.. టాలీవుడ్‌లో నెపోటిజం ఉందా? స్టార్ కిడ్స్‌తో ఏవైనా చేదు అనుభవాలున్నాయా? అనే ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. ఈ మేరకు , మహేష్ బాబుల క్యారెక్టర్స్ ఎలాంటివో చెప్పారు . బాలీవుడ్ గురించి తెలియదు కానీ మన టాలీవుడ్‌లో మాత్రం అలాంటివేమీ పెద్దగా లేవని చెప్పుకొచ్చాడు నాని. తన కెరీర్ బిగినింగ్ నుంచే అంతా సహకరించారని, అలాగే తన సినిమాల గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం గానీ, ఎక్కడైనా ఫంక్షన్‌లో నేను కలిసినప్పుడు నన్ను పలకరించడం గానీ.. అన్ని విషయాల్లో బిగ్గెస్ట్ స్టార్స్ ఫుల్ సపోర్ట్ చేశారని అన్నారు. అప్పుడున్న పెద్ద హీరోల్లో , తారక్, రానా లాంటి స్టార్ కిడ్స్ చాలా ప్రేమగా పలకరించేవారని, తన సినిమాలపై వారి వారి అభిప్రాయలు కూడా చెప్పేవారని ఆయన పేర్కొన్నారు. Also Read: కాకపోతే వాళ్లకున్న అడ్వాంటేజ్ ఒక్కటే.. అప్పటికే ఉన్న బ్యాగ్రౌండ్, ఫ్యాన్ బేస్ కారణంగా వాళ్లకు ఒక్క సినిమాతో వచ్చే క్రేజ్ తనకు నాలుగు సినిమాలతో వస్తుందని నాని తెలిపారు. ''అదేసమయంలో వాళ్ళెంత కష్టపడినా వాళ్లను స్టార్ కిడ్ అనే అంటారు. అదే మనల్ని సెల్ఫ్ మేడ్ అంటారు'' అంటూ సూపర్ లాజిక్ చెప్పారు నాని. అందుకే అటు స్టార్ కిడ్స్‌కి, ఇటు మా లాంటి వాళ్లకు ఇక్కడ రెండు రకాల ప్రయోజనాలున్నాయని ఆయన చెప్పడం విశేషం.


By September 05, 2020 at 11:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/in-latest-interview-nani-reacted-on-nepotism-in-tollywood/articleshow/77944603.cms

No comments