తాగి వేధిస్తున్న వాలంటీర్.. విశాఖలో విషాదం


తాగుబోతు భర్త వేధింపులు తాళలేక వివాహిత చేసుకున్న విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి పట్టణంలోని అగనంపూడి కాలనీకి చెందిన సూరి అప్పారావు కూతురు ధనలక్ష్మి(23)ని కృష్ణాపురం కాలనీకి చెందిన గోవింద్‌కి ఇచ్చ మూడేళ్ల కిందట వివాహం జరిపించాడు. వార్డు వాలంటీర్‌గా పనిచేస్తున్న గోవింద్ నిత్యం తాగొచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. తాగుబోతు భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య ధనలక్ష్మి అఘాయిత్యానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణవార్త విని తల్లిదండ్రులు కుంగిపోయారు. అల్లుడి వేధింపుల కారణంగానే కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి తండ్రి అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 20, 2020 at 11:56AM
No comments