Breaking News

అల్లుడిని కిరాతకంగా చంపేసిన మామ.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య


తమిళనాడులో యువకుడి పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. తమ కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో ఓ వ్యక్తి అల్లుడిని కిరాతకంంగా చంపేశాడు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను నిత్య తలుచుకుంటూ మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లా ఓట్టర్‌తిన్నై గ్రామానికి చెందిన రాజేశ్వరి(21), విజయ్‌ అనే యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొద్ది నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. Also Read: సుమారు ఆరు నెలలుగా వీరి ఎవరి కంట పడకుండా ఓ ప్రాంతంలో గుట్టుగా కాపురం చేసుకుంటున్నారు. వీరి ఆచూకీ తెలుసుకున్న రాజేశ్వరి తండ్రి ఆగస్టు 1న మాట్లాడుకుందాం రమ్మంటూ ఇంటికి పిలిచాడు. ప్లాన్ ప్రకారం తన బంధువులతో కలిసి అల్లుడిని కిరాతకంగా చంపేశాడు. కళ్లెదుటే భర్త హత్యకు గురికావడంతో రాజేశ్వరి షాక్‌‌లోకి వెళ్లిపోయింది. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. Also Read: మరోవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన విజయ్ పరువు హత్యకు గురికావడంతో రాజేశ్వరి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. భర్త ఎడబాటును తట్టుకోలేక మంగళవారం పుట్టింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరువు పైత్యానికి ప్రేమజంట బలి కావడం స్థానికంగా విషాదం నింపింది. Also Read:


By September 03, 2020 at 07:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-commits-suicide-in-tamil-nadu-over-depressed-for-husband-murder/articleshow/77902054.cms

No comments