Breaking News

ప్రేమకథకు విలన్లుగా మారిన పెద్దలు.. పురుగుల మందు తాగిన జంట


తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా ముమ్మిడివరం మండలంలో జరిగింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు కొనప్రాణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముమ్మిడివరానికి చెందిన యువతి, గేదెల్లంకకు చెందిన బుడితి శ్రీనివాస్‌ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. Also Read: ఈ విషయం తెలుసుకున్న పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఇద్దరూ కలుసుకోకూడదని కండిషన్ పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట ఆదివారం గ్రామ శివారులో కలుసుకుని పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో యువతి మృతిచెందగా.. శ్రీనివాస్‌ అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ పసుపులేటి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 08, 2020 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/love-couple-consumed-poision-in-mummidivaram-woman-died/articleshow/77990697.cms

No comments