Breaking News

మైనర్ బాలికపై ఆర్నెల్లుగా అత్యాచారం.. ప్రకాశం జిల్లాలో దారుణం


ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. మైనర్ బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమెను బెదిరిస్తూ ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘటన పట్టణంలోని బాలిరెడ్డి నగర్‌లో జరిగింది. బాలిరెడ్డి నగర్‌కు చెందిన పేద దంపతుల కుమార్తె(15) యుగంధర్ అనే వ్యక్తి ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తోంది. బాలిక అమాకత్వాన్ని ఆసరాగా తీసుకున్న యుగంధర్ ఆమెను బెదిరించి ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. Also Read: ఇటీవల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక శరీరంలో మార్పులు గమనించిన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భంతో ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు సింగరాయకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వారు నిందితుడు యుగంధర్, అతడి భార్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 01, 2020 at 12:44PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/house-owner-raped-on-minor-girl-in-prakasam-district/articleshow/77866948.cms

No comments