Breaking News

నర్సుపై కన్నేసిన వైద్యాధికారి... ఇంటికి పిలిచి బెదిరించి అత్యాచారం


కరోనా వైరస్ సోకిన 19ఏళ్ల యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువకముందే కేరళలో మరో దారుణం చోటుచేసుకుంది. తనపై వైద్యాధికారి ఒకరు ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై తిరువనంతపురంలోని పంగోడే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: ప్రాంతానికి చెందిన ఓ వివాహిత(44) హోమ్ నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ఓ రోజు రాత్రి విధులు ముగించుకుని వెళ్తున్న ఆమెకు జూనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఒకరు ఫోన్ చేసి క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలోనే ఆమె కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. టెస్ట్‌కు సంబంధించిన పత్రాన్ని తనకు చూపించాలని అధికారి కోరడంతో ఈ నెల మూడో తేదీన అతడికి ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అధికారి బెదిరించి నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రంతా ఆమెకు నరకం చూపించి మరుసటి రోజు ఉదయం పంపించాడు. Also Read: అక్కడి నుంచి బాధితురాలు నేరుగా పంగోడే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అధికారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని వైద్య శాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. Also Read:


By September 08, 2020 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/health-officer-arrested-in-kerala-over-raping-44-yrs-old-nurse/articleshow/77989991.cms

No comments