Breaking News

రాష్ట్రపతి, ప్రధాని సహా.. ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి


ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. మాజీ రాష్ట్రపతి సోమవారం మృతి చెందిన విషయం విదితమే. నేడు ఆయన భౌతిక దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్ నివాసంలో ప్రజల సందర్శనార్థం ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహాన్ని ఉంచారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ తదితరు ప్రణబ్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణేతోపాటు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు మాజీ రాష్ట్రపతికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కరోనా మార్గదర్శకాల ప్రకారం లోథీ ఎస్టేట్‌లో ప్రణబ్ అంత్యక్రియలను నిర్వహిస్తారు. ప్రణబ్‌పై మృతితో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు లేఖ రాశారు. ప్రణబ్ ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో విడదీయరాని భాగమయ్యారని సోనియా కొనియాడారు. ప్రణబ్ మేధాశక్తిని ఆమె కొనియాడారు. ప్రణబ్‌ మరణంతో దేశం దుఃఖంలో మునిగిపోయిందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు.


By September 01, 2020 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/president-kovind-pm-modi-and-others-pay-last-respects-to-pranab-mukherjee/articleshow/77866504.cms

No comments