Breaking News

అటు పవన్.. ఇటు రేణు.. న్యాయం కోసం పోరాటం!


ఇదేంట్రా బాబూ.. అన్నీ అయిపోయాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ విడాకులు కూడా తీసేసుకున్నారు. ఎవరికి వాళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు.. రేణూ కూడా మళ్లీ పెళ్లి చేసుకోవాలని చూస్తోంది.. మళ్లీ న్యాయం కోసం పోరాటమేంటి..? అనే సందేహం వచ్చింది కదూ.. అదేం కాదండోయ్.. ఇదంతా రియల్ లైఫ్‌లో మాత్రం కాదండోయ్.. రీల్ లైఫ్‌లో మాత్రమే. ఇంతకీ వీరిద్దరూ చేస్తున్న ఈ పోరాటమేంటి..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పవన్ పోరాటం విషయానికొస్తే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం విదితమే. బాలీవుడ్ ‘పింక్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఇప్పటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా షూటింగ్‌ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమాలో పవన్.. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసేందుకుగాను వకీల్‌ (లాయర్‌) పాత్రలో నటిస్తున్నాడు. మరీ ముఖ్యంగా మహిళలకు జరిగిన అన్యాయం పట్ల అండగా నిలవబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన అంజలి, నివేదా థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ మెగా అభిమానులను, ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

రేణూ పోరాటం విషయానికొస్తే..

ఒకప్పటి ఫేమస్ హీరోయిన్, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా ఏళ్లుగా కెమెరాకు దూరంగా ఉంటూ వస్తోంది. మంచి కథ ఉన్న ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో చెప్పిన ఆమెకు మంచి పాత్ర దొరికింది. ఈ రీ ఎంట్రీ విషయాన్ని అఫీషియల్‌గా రేణూనే ప్రకటించింది. అతిత్వరలో తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తానని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కన్ఫామ్ చేసింది. ఓ అందమైన వెబ్‌ సిరీస్‌లో చేసేందుకు సైన్ చేశానని.. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రావడం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉందని చెప్పింది. వచ్చే నెల (అక్టోబర్‌)లో వెబ్‌ సిరీస్ షూటింగ్‌ ప్రారంభం కానుందని.. ఇందులో తనది న్యాయం కోసం పోరాడే పాత్ర అని తెలిపింది. నిజాన్ని ఛేదిస్తూ న్యాయం కోసం పోరాడే బలమైన మహిళగా నటించనుండటం చాలా ఆతృతగా ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మీ అందరి నుంచి సపోర్ట్ ఆశిస్తున్నానని తెలిపింది. కాగా.. ఈ సిరీస్‌ సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటుండగా.. ఎమ్‌.ఆర్‌. కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు.

సో.. ఇలా మొత్తమ్మీద అటు పవన్.. ఇటు రేణూదేశాయ్ ఇద్దరూ న్యాయపోరాటం చేస్తున్నారన్న మాట. సో.. వాళ్లిద్దరూ విడిపోయినా రేణును మాత్రం ఇప్పటికే చాలా వరకు మెగాభిమానులు అభిమానిస్తూనే ఉన్నారు. కొందరు మాత్రమే విమర్శిస్తుంటారంతే. అంటే మెగాభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. న్యాయం కోసం చేస్తున్న పవన్, రేణూ ఇద్దరిలో జనాలను బాగా ఎవరు మెప్పిస్తారో వేచి చూడాలి.



By September 22, 2020 at 02:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/52652/pawan-and-renu-desai.html

No comments