రష్మీ మనసు కరిగించిన నెటిజన్.. నీ అడ్రస్ చెప్పమంటూ జబర్దస్త్ బ్యూటీ రిప్లై! ఇదీ మ్యాటర్
బుల్లితెర యాంకర్‌గా జబర్దస్త్ అందాలతో మస్త్ పాపులారిటీ తెచ్చుకుంది . అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తూ స్పెషల్ ట్రీట్ ఇస్తున్న రష్మీ స్వచ్ఛమైన మనసు గురించి మనందరికీ తెలుసు. నిత్యం సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా జంతు ప్రేమికులరాలైన ఈమె.. ఏ మాత్రం సమయం దొరికినా మూగ జీవాల సంరక్షణ చేపడుతూ గొప్ప మనసు చాటుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్కా అంటూ రష్మీ సాయం కోరాడు ఓ నెటిజన్. తన అభ్యర్థన తెలుపుతూ ఆమె మనసు కరిగించాడు. పుస్తకాలు కొనుక్కునేంత ఆర్ధిక స్థోమత కూడా లేదని పేర్కొంటూ ఓ నిరుద్యోగి రష్మీకి సందేశం పెట్టాడు. ''మేడమ్ దయచేసి నాకు సహాయం చేయండి. నేను పోటీ పరీక్షలకు కోసం ప్రిపేర్ అవుతున్నాను. డిసెంబర్ 15వ తేదీన నాకు పరీక్ష ఉంది. ఆ పరీక్షకు సన్నద్ధం కావడానికి రెండు పుస్తకాలు కావాలి. కానీ అవి కొనుక్కొనే స్థోమత నాకు లేదు. ఆ రెండు పుస్తకాలు కొనిస్తే నా విజయానికి మీరు కారణమవుతారు. ఈ జాబ్ నేను ఎలాగైనా సాధించాలి. దయచేసి సహాయం చెయ్యి అక్కా'' అని అభ్యర్థిస్తూ ఆ బుక్స్ ఫోటోలను పోస్ట్ చేశాడు. Also Read: దీంతో ఇది చూసిన రష్మీ మనసు కరిగిపోయింది. వెంటనే సదరు నిరుద్యోగి ట్వీట్‌పై స్పందిస్తూ.. ''నీ అడ్రస్ చెప్పు.. వాటిని కొని మీకు పంపిస్తా'' అని రిప్లై ఇచ్చింది. దీంతో రష్మీ పెద్ద మనసు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. మీరేం కంగారు పడకండి.. రష్మీ సహాయం మీకు అందుతుంది అంటూ ఆ నిరుద్యోగికి ధైర్యం చెబుతున్నారు. ఇక రష్మీ కెరీర్ విషయానికొస్తే.. ''జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్, అనుభవించు రాజా'' లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా బుల్లితెర హవా కొనసాగిస్తూనే వెండితెరపై ఆచితూచి అడుగులేస్తోంది. రష్మీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బొమ్మ బ్లాక్‌బస్టర్' నుంచి ఇటీవలే విడుదలైన ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
By September 19, 2020 at 12:27PM
No comments