Breaking News

కారు పార్కింగ్ స్టన్నింగ్ వీడియో.. డ్రైవర్ టాలెంట్‌కు జనం ఫిదా


డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు ఎవరైనా కారును నడపొచ్చు. కానీ మాములుగా నడపటం వేరు, స్కిల్ ఉండటం వేరు. ఉద్యోగం చేసుకుంటూ.. ఆఫీసుకెళ్లే వారికి కారు నడపడం వస్తే చాలు. కొందరు ప్రొఫెషనల్ డ్రైవర్లు మాత్రం కారును రోడ్డు బాగోలేకపోయినా నడపగలరు. కొందరైతే ఇరుకైన ప్రదేశాల్లోనూ కారును పార్కింగ్ చేయగలరు. రోడ్డు పక్కన కొందరు వాహనాన్ని నిలిపే తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా పార్కింగ్ చేయడం ఎలా సాధ్యం అవుతుందనిపిస్తుంది. కేరళలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఎస్‌యూవీ పొడవు కూడా లేని సిమెంట్ బేస్ మీద ఓ డ్రైవర్ వాహనాన్ని పార్కింగ్ చేశాడు. ఆ సిమెంట్ బేస్‌కు రెండు వైపులా.. ఐరన్ గ్రిల్స్ ఉన్నప్పటికీ.. ఆ కొద్ది గ్యాప్‌లోనే డ్రైవర్ పార్కింగ్ చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. కాస్త ముందుకో వెనక్కో అయినా.. ఆ వాహనం గోతిలో పడిపోవడం ఖాయం. కానీ ఆ డ్రైవర్ ఎంతో చాకచక్యంగా.. కారును పార్కింగ్ చేసి.. తర్వాత అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న వారు అలాగే నిలబడి మరీ అతడు కారును పార్కింగ్ చేయడాన్ని చూస్తుండిపోయారు. అదీ మాళయాళీ డ్రైవర్ అంటే.. అతడి స్కిల్‌కు, కాన్ఫిడెన్స్‌కు సెల్యూట్ అంటూ విజయ్ తొట్టతిల్ అనే వ్యక్తి వీడియోను ట్వీట్ చేశారు. ఇలా మీరు మాత్రం ట్రై చేసి రిస్క్‌లో పడకండి.


By September 08, 2020 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/this-malayalee-driver-car-parking-video-simply-amazing/articleshow/77989116.cms

No comments