సహజీవనం చేసి వదిలేసిన ప్రియుడు.. నడిరోడ్డుపై మహిళ ఆత్మహుతి

తనతో సహజీవనం చేసిన బిడ్డ పుట్టాక వదిలేసిన ప్రియుడి మోసాన్ని తట్టుకోలేకపోయిన మహిళ అతడి ఇంటి ముందే నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. నడిరోడ్డుపై ఆమె మంటల్లో కాలుతున్నా కనీసం ఎవరూ రక్షించే ప్రయత్నం చేయకుండా సెల్‌ఫోన్లలో వీడియోలు తీస్తూ కాలక్షేపం చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దిండుగల్ జిల్లా కొడైకెనాల్ కేసిపట్టి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం టీ దుకాణం సమీపంలో ఓ మహిళ మూడేళ్ల బిడ్డను వదిలేసి వెళ్లింది. Also Read: కొంత దూరంలోని ఓ ఇంటి ముందుకు నడుచుకుంటూ వెళ్లిన ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ సమయంలో చాలామంది ప్రజలు చూస్తున్నా కనీసం ఒక్కరు కూడా ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. కొందరైతే తమ సెల్‌ఫోన్లో వీడియోలు తీశారు. చివరకు ఓ వ్యక్తి స్పందించి తన పంచెతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే ఆమె కాలిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెంటనే చేరుకుని పరిశీలించారు. Also Read: మృతురాలి పేరు మాలతి అని, కొంతకాలం క్రితం భర్తను వదిలేసిన ఆమె సతీష్ అనే డ్రైవర్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిద్దరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే మాలతికి తెలియకుండా సతీష్ మరో యువతిని పెళ్లి చేసుకుని ఓ ఇంట్లో కాపురం పెట్టాడు. వారం రోజులు ప్రియుడి ఆచూకీ లేకపోవడంతో మాలతి ఆరా తీయగా అసలు సంగతి తెలిసింది. దీంతో ప్రియుడి చేతిలో మోసపోయానని మనస్తాపం చెందిన మాలతి సతీష్ ఇంటి ఎదుట ఆత్మాహత్య చేసుకుంది. Also Read:
By September 01, 2020 at 11:04AM
No comments