Breaking News

పెట్రోల్ పోసుకుని మంటల్లో కాలిపోయిన ప్రేమజంట.. నల్గొండలో కలకలం


పెట్రోల్ పోసుకుని చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమికులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని అగ్నికి ఆహుతయ్యారు. ఈ దారుణ ఘటన హాలియా మండలం పాలెం గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో చోటుచేసుకుంది. ప్రేమజంటను హైదరాబాద్‌కి చెందిన షేక్ మస్తాన్ వలి, అశ్వినిగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరూ చెవిటి, మూగ వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. ఇద్దరూ బైక్‌పై నాగార్జున సాగర్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ విహరించిన జంట రాత్రి సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. సాయంత్రం సమయంలో అశ్విని తన తల్లికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. మాటలు రాకపోయినా సైగలతో తన భావాలను చెబుతూ చనిపోతున్నట్లు అశ్విని చేసిన సైగలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. సంఘటన స్థలంలో లభించిన ఐడీకార్డుల ఆధారంగా వారిని మస్తాన్ వలి, అశ్వినిగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే మస్తాన్ వలి వివాహితుడిగా తెలుస్తోంది. పెళ్లైన తర్వాత ప్రేమ కారణంగానే జంట ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read:


By September 10, 2020 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/love-couple-set-ablaze-in-nalgonda-district/articleshow/78030800.cms

No comments