ట్రాక్టర్ నుంచి విడిపోయిన ట్రక్కు తల్లీబిడ్డలను మింగేసింది.. చిత్తూరులో ఘోరం
చిత్తూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ నుంచి విడిపోయిన ట్రక్కు దైవదర్శనానికి వెళ్లొస్తున్న కుటుంబాన్ని చిదిమేసింది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘోర ప్రమాదం భాకరాపేట ఘాట రోడ్డులో జరిగింది. యాదమరి మండలానికి చెందిన దేవేంద్ర కుటుంబంతో చిన్నగొట్టిగల్లు మండలం యడంవారిపల్లెలో నివాసముంటున్నాడు. ఎక్స్‌కవేటర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవేంద్ర.. భార్య జమున(30), కూతురు మీనాక్షి(12), కొడుకు దీపక్(8)తో కలసి ఐతేపల్లిలోని ఆలయానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా భాకరాపేట ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ నుంచి విడిపోయిన ట్రక్కు అమాంతం బైక్‌పైకి దూసుకొచ్చింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధి ఎల్లసిరికి చెందిన వినాయక్ గడ్డి లోడును దించేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ నుంచి ట్రక్కు విడిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న దేవేంద్ర కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య జమున, కొడుకు దీపక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Also Read: తీవ్రగాయాలపాలైన కూతరు మీనాక్షి తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తండ్రి దేవేంద్రకి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
By September 26, 2020 at 10:03AM
No comments