Breaking News

ప్రేమపేరుతో బాలికపై అత్యాచారం.. కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులు


బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని అనేకసార్లు అత్యాచారం చేయడమే కాకుండా కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్న కామాంధుడిని కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిజ్‌బాబానగర్‌ సీ-బ్లాక్‌ ప్రాంతానికి చెందిన అర్బాస్‌ సాబ్రీ(26) అనే వ్యక్తి స్థానికంగా బాలిక(17)ను ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని స్నేహితుల సాయంతో అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి కొద్దిరోజుల క్రితం కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు చాదర్‌ఘాట్‌‌కు చెందిన రియాజ్‌(25)తో పాటు మరో నలుగురు వ్యక్తులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది. Also Read: దీంతో పోలీసులు సాబ్రీపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అతడిని జైలుకు పంపారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన అతడు కేసు వాపసు తీసుకోవాలంటూ బాధితురాలిని బెదిరింపులకు దిగాడు. తాను చెప్పినట్లు వినకపోతే అంతు చూస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఇటీవల హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినా కంచన్‌బాగ్ పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. Also Read: దీనిపై వివాదం చెలరేగడంతో పోలీసులు సాబ్రీని మరోసారి అరెస్ట్ చేశారు. నిందితుడు బాలికను తన స్నేహితుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని, ఇందుకు సహకరించిన చాదర్‌ఘాట్‌కు చెందిన రియాజ్‌, జల్‌పల్లికి చెందిన యూనుస్‌(35)ను శనివారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఆరోపిస్తున్నట్లు ఈ కేసులో తాము నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By September 06, 2020 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-rapes-minor-girl-in-hyderabad-and-blackmails-to-her/articleshow/77958486.cms

No comments