కృష్ణానగర్‌లో దారుణం.. సట్టా ఆటలో వివాదం యువకుడి హత్య

భాగ్యనగరం నడిబొడ్డున జరిగిన హత్య కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే కృష్ణా నగర్‌లో గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సట్టా ఆటలో చోటుచేసుకున్న వివాదంలో సదరు యువకుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణానగర్ మెట్రో పిల్లర్ ఓ యువకుడు రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్నాడు. అతడ్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు పోలీసులకు సమాచారం అందించారు. Read More: అయితే అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా శరీరం, ఛాతి, కడుపులో కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 28 ఏళ్ల లోపు ఉంటుంది. అడ్డా కూలీగా పనిచేసే వ్యక్తి కావచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహం ఉన్న కొద్ది దూరంలో ప్రతిరోజూ సాయంత్రం అడ్డాకూలీలు మద్యం తాగి రాత్రివేళ సట్టా ఆడుతుంటారు. శుక్రవారం రాత్రి సట్టా ఆడుతున్న సమయంలో వివాదం జరగడంతో హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే వారిని పిలిపించి విచారిస్తున్నారు.
By September 12, 2020 at 07:26AM
No comments