Breaking News

మోడ్రన్‌‌గా ముస్తాబై మగాళ్లకి వల.. మాటలతో రెచ్చగొట్టి ముంచేస్తున్న కిలాడీలు


ప్యాంట్, షర్టు వేసుకుని మోడ్రన్‌గా ముస్తాబవుతారు. చక్కని ప్రదేశంలో రోడ్డు పక్కన నిల్చుని వచ్చేపోయే వారికి వలపు వల విసురుతారు. సరసపు మాటలతో మగాళ్లని రెచ్చగొట్టి ముగ్గులోకి దించుతారు. అమాయకులు దొరకగానే అందినకాడికి దోచుకుని పరారవుతారు. రెచ్చగొట్టే హావభావాలతో కవ్వింపు చర్యలకి దిగుతున్న లేడీ గ్యాంగ్‌ని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా రజులాలో షాకింగ్ కేసు వెలుగుచూసింది. టిప్‌టాప్‌గా రెడీ అయిన ఆరుగురు మహిళలు పట్టణంలోని హిండోర్నా ఇంటర్‌సెక్షన్ సమీపంలో రోడ్డుపై నిల్చున్నారు. ప్యాంట్, షర్ట్‌లో మోడ్రన్‌గా కనిపిస్తున్న లేడీస్.. వచ్చేపోయే వారిని కవ్విస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు.. హావభావాలతో మగాళ్లను రెచ్చగొడుతున్నారు. విషయం తెలుసుకున్న రజులా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గమనించారు. వచ్చేపోయే వారిని రాసలీలల పేరుతో రెచ్చగొట్టడం గమనించి అదుపులోకి తీసుకున్నారు. తీరా స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఠాగా ఏర్పడిన లేడీ గ్యాంగ్ మగాళ్లని రెచ్చగొట్టి ముగ్గులోకి దించుతుంది. అమాయకులు దొరికితే వెంటనే ఒకరు కారులో కూర్చుంటారు. మిగిలిన మహిళలు వచ్చి బెదిరింపులకు గురిచేసి అతన్ని నిలువునా దోచుకుంటారని తేలడంతో పోలీసులు షాకయ్యారు. Also Read: గతంలో సబర్‌కాంత ఏరియాలోనూ ఇలాంటి నేరాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే రజులాలో దోపిడీ ఘటన జరగకముందే అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులపై పబ్లిక్‌లో అసభ్య ప్రవర్తన తదితన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆరుగురు మహిళలను అరెస్టు చేసి కోవిడ్ పరీక్షలకు తరలించారు. Read Also:


By September 12, 2020 at 12:39PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/flirting-women-gang-arrested-in-gujarat/articleshow/78073282.cms

No comments