కాకినాడలో కేటుగాడు.. కాస్ట్‌లీ కార్లతో ఘరానా మోసం
రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో బిల్డప్ ఇచ్చి కాస్ట్‌లీ కార్లను టార్గెట్ చేస్తాడు. అద్దె పేరుతో యజమానులకు టోకరా వేసి కార్లతో పరారవుతున్న కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని సర్పవరం జంక్షన్ బోట్‌క్లబ్ ఏరియాలోని స్పెన్సర్స్ సమీపంలో నివాసముంటున్న ఎం.కృష్ణమోహన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. బిజినెస్ పనులు ఉన్నాయని చెప్పి సామర్లకోట మండలం పనసపాడుకి చెందిన తోట పద్మజ దంపతుల వద్ద స్కార్పియో కారు అద్దెకు తీసుకున్నాడు. రోజుకు రూ.1000 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి అద్దె చెల్లించకుండా తప్పించుకు తిరుగడం మొదలుపెట్టాడు. కారు కూడా కనిపించకుండా చేయడంతో బాధితురాలు పద్మజ సర్పవరం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణమోహన్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పద్మజ ఒక్కరే కాదు మరి కొంతమంది నుంచి పదుల సంఖ్యలో కార్లు తీసుకుని మోసగించినట్లు తెలిసింది. Also Read: కృష్ణమోహన్‌ని విచారించిన పోలీసులు సుమారు 15 కార్లను పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వాటిలో ఇన్నోవా, మహీంద్రా ఎక్స్‌యూవీ, స్కార్పియో వంటి లగ్జరీ వాహనాలున్నాయి. ఖరీదైన కార్లని టార్గెట్ చేసి మరీ అద్దె పేరుతో యజమానులను బురిడీ కొట్టిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘరానా మోసంపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని స్థానిక సీఐ చెప్పినట్లు సమాచారం. Read Also:
By September 20, 2020 at 10:48AM
No comments