Breaking News

భద్రాద్రి: భర్త చనిపోయిన మహిళకు యువకుడి వల.. గర్భవతిని చేసి పరార్


భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్న మహిళ జీవితంలోకి ప్రవేశించాడో యువకుడు. తాను అండగా ఉంటానని, పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రసాదిస్తానని మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. శారీరక వాంఛలు తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ఆమెకు మొహం చాటేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. ఆ కామాంధుడు చేసిన మోసానికి తిండీతిప్పలు లేక శరీరం శుష్కించి ఆ అభాగ్యురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. Also Read: సారపాకకు చెందిన ఓ మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు ఓ కుమార్తె ఉంది. కొంతకాలం క్రితం భర్త మరణించడంతో కూరగాయలు అమ్ముకుంటూ కుమార్తెను పోషించుకుంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడు రెండేళ్ల క్రితం ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం 8 నెలల గర్భంతో ఉన్న ఆమెను యువకుడు వదిలేసి వెళ్లిపోయాడు. ఆ దుర్మార్గుడు చేసిన మోసానికి షాకైన బాధితురాలు తిండి తినకుండా మంచం పట్టింది. Also Read: ఈ విషయాన్ని స్థానికులు హెల్ప్‌లైన్ నంబర్ 181కి ఫోన్ చేసి చెప్పారు. దీంతో జిల్లా కేందం అడ్మిన్‌ శుభశ్రీ, లీగల్‌ కౌన్సెలర్‌ అన్నపూర్ణ సారపాకకు వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు ఆమెను వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. బాధితురాలిని మోసం చేసిన పరారైన యువకుడిపై కఠినచర్యలు తీసుకోవడంతో పాటు, ఆమెకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. Also Read:


By September 03, 2020 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-cheating-married-woman-for-pretext-on-marriage-she-gets-prengnancy/articleshow/77902171.cms

No comments