Breaking News

ఆడదానికే అన్ని బాధ్యతలు.. మరో జన్మంటూ అలాగే పుట్టాలి.. ఫీలింగ్స్ బయటపెట్టిన అనసూయ


బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా సూపర్ ఫాలోయింగ్ కూడగట్టుకొని ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది . బుల్లితెరపై కామెడీ పండించాలన్నా, వెండితెరపై సీరియస్‌గా నటించాలన్నా తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న ఈ జబర్దస్త్ బ్యూటీ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫీలింగ్స్ బయటపెడుతూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. తన లైఫ్ సీక్రెట్ చెబుతూనే మనసులోని భావాలను అందరితో పంచుకుంది. ఈ క్రమంలోనే తనకు మరో జన్మంటూ ఉంటే ఏనుగులా పుట్టాలని ఉందంటూ అందుకు కారణాలు కూడా చెప్పేసింది అనసూయ. ఈ ఏనుగు జాతిలో వారి వారి పార్ట్‌నర్స్ చనిపోతే.. మిగిలిన ఆ ఏనుగు తిండి తిప్పలు మానేసి చనిపోతుంది. అలాగే వృద్దురాలైనా ఆడ ఏనుగే కుటుంబ బాధ్యతలను చూసుకుంటుందట. అందుకే ఏనుగులా పుట్టాలని కోరుకుంటున్నానని అనసూయ తెలిపింది. అనసూయ ముద్దు ముద్దు మాటల్లో ఇలా ఏనుగు జాతి గొప్పతనం చెప్పడాన్ని చూసి జంతు ప్రేమికులు తెగ సంబర పడుతున్నారు. ‌ ఇకపోతే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్స్‌పై రియాక్ట్ అయిన అనసూయ.. మొదట్లో ఆ ట్రోలింగ్స్ చూసి భయపడిపోయేదాన్నని కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నానని చెప్పింది. పలు సందర్భాల్లో తనను ట్రోల్ చేసిన వారిపై అనసూయ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఇంటర్వ్యూలో బుల్లితెర, వెండితెర తనకు తల్లిదండ్రుల వంటివని పేర్కొంది ఈ జబర్దస్త్ బ్యూటీ. Also Read: టీవీ ఇండస్ట్రీకి రాకముందు తాను బ్యాంకులో టెలీకాలర్‌గా 5 వేల రూపాయల కోసం పనిచేశానని, ఆ తర్వాత ఎంబీఏ, చిన్న ఉద్యోగం.. ఇలా ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పిన అనసూయ తిమ్మిదేళ్ళ పాటు ప్రేమించి సుశాంక్‌ని భర్తగా పొందానని చెప్పింది. ప్రస్తుతం బిజీ లైఫ్ గడుపుతున్న ఈ బ్యూటీ జబర్దస్త్‌తో పాటు పలు ప్రత్యేక ప్రోగ్రామ్స్ ద్వారా అలరిస్తోంది. అలాగే కృష్ణవంశీ రూపొందిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో ఈమె దేవదాసి రోల్ చేస్తోందని, అలాగే సుకుమార్-బన్నీ కాంబోలో వస్తోన్న ‘పుష్ప’లో కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం.


By September 01, 2020 at 01:17PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anasuya-bharadwaj-comments-on-her-next-birth/articleshow/77867875.cms

No comments