Breaking News

అనుమానపు భర్త వేధింపులు.. పెళ్లైన వారానికే యువతి ఆత్మహత్య


అనుమానపు భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది. వేలూర్‌ సమీప గ్రామానికి చెందిన యువతి(24)కి, కాట్పాడికి చెందిన బాలాజీ అనే యువకడితో ఆగస్టు 23న వివాహం జరిగింది. నూతన దంపతులు విందు కోసం మూడు రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లారు. ఆదివారం రాత్రి ఇంటి మేడపై ఉన్న గదిలో ఆమె ఒంటరిగా ఉంది. గదిలో నుంచి కేకలు వినిపించడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా మంటల్లో కాలిపోతూ కనిపించింది. Also Read: ఆమెను రక్షించి వెంటనే అడుంకపారైలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేలూర్‌ మెజిస్రేట్‌ ఆస్పత్రికి వెళ్లి యువతి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. కాసేపటికే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి రాసిన సూసైడ్‌ నోట్‌‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. Also Read: తాళి కట్టిన రోజు నుంచే భర్త తనను అనుమానంతో వేధిస్తున్నాడని, ఎవరితో మాట్లాడినా సూటిపోటి మాటలు అంటూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని బాధితురాలు లేఖలో పేర్కొంది. అనుమానపు మొగుడితో కలిసి బ్రతకడం ఇష్టంలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసింది. దీంతో పోలీసులు బాలాజీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:


By September 02, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/newly-married-man-commits-suicide-in-tamil-nadu/articleshow/77881851.cms

No comments