వకీల్ సాబ్ మోషన్ పోస్టర్.. పగిలిపోయిందంతే

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్. ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టే ఉదయం 9.9 గంటలకు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
By September 02, 2020 at 09:14AM
No comments