కూతురిని అమ్మేసిన తండ్రి.. గర్భవతిని చేసి వీధిలో విసిరేసిన యువకుడు.. దారుణం
ఆడపిల్లను ఆటబొమ్మను చేసి ఆడుకున్న దారుణ ఘటన వెలుగుచూసింది. ఎదిగిన కూతురిని సంతలో పశువులా కనికరం లేకుండా అమ్మేశాడో కసాయి తండ్రి. ఇంటి పని కోసం అమ్మాయి కావాలని ఆమెను కొనుక్కున్న యువకుడు కామవాంఛలు తీర్చుకుని.. గర్భవతిని చేసి నడిరోడ్డుపై వదిలేశాడు. కరోనా కాలంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యురాలు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల కంటపడడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన టీనేజ్ యువతి(16) తల్లిని కోల్పోయిన కొద్దిరోజులకే తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కూతురిని కనికరం లేకుండా సంతలో పశువులా రూ.3 వేలకు అమ్మేశాడు. ఇంట్లో పని చేసేందుకు అమ్మాయి కావాలని 21 ఏళ్ల యువకుడు ఆమెను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి కామవాంఛలు తీర్చుకుంటూ పైశాచికానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక గర్భం దాల్చడంతో యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను నడివీధిలోకి నెట్టేశాడు. కడుపుతో ఉన్న యువతి కరోనా కాలంలో అష్టకష్టాలు పడింది. మహమ్మారి కారణంగా ఆమెను దగ్గరకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ అభాగ్యురాలి విషయం తెలుసుకున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ముందుకొచ్చి ఆదుకున్నారు. Also Read: బిలాస్‌పూర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను రాయ్‌గఢ్ సఖి కేంద్రానికి తరలించి సంరక్షిస్తున్నారు. మృగాళ్ల చేతిలో దాష్టీకానికి గురైన ఆమె మామూలు మనిషి కావడానికి ఐదు నెలలు పట్టింది. సుదీర్ఘ కౌన్సిలింగ్ అనంతరం ఆమె పెదవి విప్పింది. బాధితురాలి తండ్రి, ఆమెను కొనుక్కుని గర్భవతిని చేసిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Read Also:
By September 30, 2020 at 11:49AM
No comments