Breaking News

అర్థరాత్రి ఆమెకు అంత్యక్రియలు చేసిన పోలీసులు.. కుటుంబసభ్యుల ఇళ్లకు తాళాలు


హత్రాస్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతి చెందిన బాధితురాలి అంత్యక్రియలను నిన్న అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులను సైతం పోలీసులు అనుమతించలేదు. పోలీసుల వాహనానికి, అంబులెన్స్‌కు బాధితురాలి కుటుంబ సభ్యులు అడ్డు పడ్డారు. నిందితులు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు మాత్రం టుంబ సభ్యుల మాట వినకుండా రాత్రికి రాత్రే బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాలకు తాళం వేయడంతో.. వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ల ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు పోలీసులను కోరామని మృతురాలి సోదరుడు పేర్కొన్నారు. అయినా కూడా వినకుండ అర్థరాత్రే అంత్యక్రియలు పూర్తి చేశారన్నారు. దీంతో పోలీసుల తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. Read More: యూపీలో హత్రాస్‌లో దళిత యువతిని దారుణంగా గ్యాంగ్ రేపు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన 20 ఏళ్ల యువతిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి.. నాలుక కోసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయా పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


By September 30, 2020 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-hathras-gang-rape-victim-cremated-by-policemen-last-night/articleshow/78400275.cms

No comments