దత్తత తీసుకున్న బాలికపై బంధువుతో కలిసి అత్యాచారం

పిల్లలు లేకపోవడంతో ఓ బాలికను దత్తత తీసుకున్న వ్యక్తి బంధువుతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. విరుదునగర్ జిల్లా కేంద్రానికి చెందిన మహేంద్రన్ (45) పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. సంతానం లేకపోవడంతో బంధువుల బాలిక(12)ను దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో బంధువులు ఆస్పత్రికి తరలించారు. Also Read: ఆమెను పరీక్షించిన డాక్టర్లు చిన్నారిపై అనేకసార్లు అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పెంపుడు తండ్రి మహేంద్రన్, అతడి అన్న కుమారుడు కామరాజ్ పెరుమాళ్ (25) బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు.. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By September 03, 2020 at 10:03AM
No comments