Breaking News

అనంతపురంలో అమానుషం.. భార్యని తిట్టాడని అన్నని చంపేసిన తమ్ముడు


అనంతపురంలో అమానుష ఘటన వెలుగుచూసింది. భార్యని తిట్టాడన్న కోపంతో అన్నని కిరాతకంగా చంపేశాడో కసాయి తమ్ముడు. జిల్లాలోని పాతపేటకి చెందిన రామాంజనేయులు, మల్లేష్ అన్నదమ్ములు. మల్లేశ్వర టాకీస్ సమీపంలో నివాసముంటున్నారు. కొద్దికాలంగా ఇద్దరి మధ్య ఓ స్థలం విషయమై వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అదే విషయమై తమ్ముడు మల్లేష్ భార్యతో గొడవ జరగడంతో రామాంజనేయులు ఆమెను తీవ్రంగా దూషించాడు. అసభ్యకర పదజాలంతో తిట్టాడు. అది మనసులో పెట్టుకున్న తమ్ముడు అన్నని కిరాతకంగా హత్య చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై మోది దారుణంగా చంపేశాడు. అనంతరం శవం పక్కనే కూర్చుని అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. స్పాట్‌లోనే కూర్చుని ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Also Read:


By September 25, 2020 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-brother-in-anantapur-district/articleshow/78308623.cms

No comments