Breaking News

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపు


ప్రధాని మోదీకి హాని తలపెడతానంటూ 100కు ఓ ఫోన్కాల్ వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు వివరాల్లోకి వెళ్తే.. హర్యానా రాష్ట్రానికి చెందిన హర్‌భజన్ సింగ్ నోయిడా నగరంలో నివాసముంటున్నారు. సింగ్ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. సోమవారం హర్‌భజన్ సింగ్ 100 పోలీసు ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోదీకే హాని తలపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నోయిడా ఫేజ్ 3 పోలీసులు నిందితుడైన హర్‌భజన్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అతడ్ని పట్టుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రధానిని బెదిరించిన హర్‌భజన్ సింగ్ డ్రగ్ ఎడిక్టు అని, అతన్ని ప్రశ్నించి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించామని నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీని ఫోన్ లో బెదిరించిన యువకుడి ఘటన నోయిడాలో సంచలనం రేపింది. డ్రగ్స్‌కు బానిసన హర్భజన్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. అందుకే అతడు ఆ విధంగా ఫోన్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రశ్నించే క్రమంలో సింగ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. ఈ విషయాన్ని స్వయంగా నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ తెలియజేశారు.


By August 11, 2020 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/noida-man-dials-100-issues-threat-to-harm-pm-narendra-modi/articleshow/77475310.cms

No comments