Namrata Shirodkar: మహేష్ పుట్టిన రోజున నమ్రత హార్ట్ టచింగ్ మెసేజ్.. హుషారెత్తిపోతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

తెలుగు చిత్రసీమలో తనకు సరిలేరు ఇంకెవ్వరూ అన్నట్లుగా కెరీర్ కొనసాగిస్తున్నారు సూపర్ స్టార్ . విలక్షణ కథలు ఎంచుకోవడం, సాహసించి సరికొత్త పాత్రల్లో కనిపించడం తనకు మాత్రమే సాధ్యం అంటూ దూసుకుపోతున్న ఈ శ్రీమంతుడి పుట్టిన రోజు ఈ రోజు (ఆగస్టు 9). ఈ సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. సూపర్ స్టార్‌కి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో మహేష్ సతీమణి నమ్రత పెట్టిన పోస్ట్ సూపర్ స్టార్ అభిమానులను మరింత హుషారెత్తిస్తోంది. మహేష్ బాబు బర్త్ డే శుభ గడియలు మొదలుకాగానే అంటే సరిగ్గా నిన్న అర్థరాత్రి 12 గంటలు దాటగానే ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో హార్ట్ టచింగ్ మెసేజ్ పెట్టింది మహేష్ సతీమణి . ''నీ నుంచి నిజమైన ప్రేమను పొందుతున్నా.. హ్యాపీ బర్త్ డే మహేష్.. ఇప్పుడైనా ఎప్పుడైనా నీకు చెప్పేది ఒక్కటే ఐ లవ్ యూ'' అని పేర్కొంటూ తన నుదిటిపై ప్రేమగా మహేష్ ముద్దుపెడుతున్న ఫోటో షేర్ చేసింది నమ్రత. దీంతో ఆ పిక్, నమ్రత పెట్టిన మెసేజ్ చూసి తెగ ఖుషీ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్. ''సూపర్ జోడీ, సరిలేరు మీకెవ్వరు'' అంటూ కామెంట్స్ పెడుతూ మురిసిపోతున్నారు. Also Read: నమ్రతను ప్రేమించి పెళ్లాడారు మహేష్ బాబు. 2000 సంవత్సరంలో వచ్చిన 'వంశీ' సినిమాలో వీళ్ళిద్దరూ జోడీ కట్టారు. బీ గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్- నమ్రత మధ్య ప్రేమ చిగురించింది. ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2005లో ఒక్కటైంది. వీరి ప్రేమకు చిహ్నంగా కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ యాక్టివ్ జోడీల్లో మహేష్- నమ్రత జోడీ ముందు వరుసలో ఉంటుంది. మహేష్ బాబు కెరీర్ పరంగా పలు సలహాలు, సూచనలిస్తూ ప్రతీ అడుగులోనూ నమ్రత కీలకపాత్ర పోషిస్తుంది.
By August 09, 2020 at 08:38AM
No comments