Breaking News

Krack: నో ఛాన్స్..! రవితేజ 'క్రాక్' మూవీ విడుదలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్


కరోనా కారణంగా పరిస్థితులు తలక్రిందులయ్యాయి. అన్ని రంగాలు కరోనా విలయతాండవానికి కుదేలయ్యాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అతలాకుతలమైంది. థియేటర్స్ మూతపడటం, సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో ఎందరో సినీ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతున్నారు. దీంతో ఆన్‌లైన్ తెరలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీ వేదికలపై సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ మూవీ '' కూడా ఓటీటీ వేదికపై రిలీజ్ కానుందని వార్తలు షికారు చేస్తుండటంతో ఆ మూవీ డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ మూవీ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు గతంలోనే వార్తలు రాగా, వాటిని దర్శకనిర్మాతలు ఖండించారు. అయితే తాజా పరిణామాల దృష్ట్యా 'క్రాక్' మరోసారి ఓటీటీ వైపే చూస్తోందటూ వార్తల ప్రవాహం ప్రారంభమైంది. దీంతో సోషల్ మీడియాలో ద్వారా స్పందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్స్ లోనే విడుదలవుతుందని.. ఓటీటీలో వచ్చే ఛాన్స్ లేదని అన్నారు. Also Read: గతంలో రవితేజతో ''డాన్‌ శీను, బలుపు'' లాంటి సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మ‌లినేని.. 'క్రాక్' రూపంలో మరో హిట్ సినిమా లైన్‌లో పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


By August 14, 2020 at 12:29PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-gopichand-malineni-clarity-on-raviteja-krack-movie-release/articleshow/77540315.cms

No comments