Breaking News

Jagityal: తాగుబోతు కొడుకు వేధింపులు తాళలేక గొడ్డలితో నరికేసిన తండ్రి


మద్యానికి బానిసై వేధిస్తున్న కొడుకుని కన్నతండ్రే కడతేర్చిన ఘటన జిల్లా ధర్మపురం మండలంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. జైన గ్రామానికి చెందిన గుడ్ల పోచరాజయ్యకు సత్యనారాయణ(38) అనే కొడుకున్నాడు. ఉపాధి కోసం గతంలో ఇరాక్ వెళ్లిన సత్యనారాయణ ఫిబ్రవరి నెలలో ఇంటికి తిరిగొచ్చాడు. తర్వాత నెల రోజులకే లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో తిరిగి వెళ్లలేకపోయాడు. Also Read: దీంతో స్థానికంగానే ఏదైనా పని చూసుకోమని తండ్రి చెప్పినా వినిపించుకోకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. మద్యానికి డబ్బులు కావాలంటూ తరుచూ వేధిస్తుండటంతో పోచరాజయ్య విసిగిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం ఆరుబయట నిద్రపోతున్న సత్యనారాయణను గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:


By August 17, 2020 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/father-kills-drunked-son-in-jagityal-district/articleshow/77582388.cms

No comments