Breaking News

కశ్మీర్‌లో ఉగ్రదాడి... పోలీస్ అధికారి, ఇద్దరు జవాన్లు వీర మరణం


జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బారాముల్లా జిల్లాల్లో ఉగ్రమూకలు కాల్పులకు పాల్పడి ముగ్గుర్ని పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. బారాముల్లాలోని సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు సోమవారం తెల్లవారుజామున ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ కాల్పుల్లో జమ్మూ కశ్మీర్‌ పోలీస్ అధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని జమ్మూ కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు. పలు రౌండ్ల పాటు ముష్కరులు కాల్పులు జరిపి, పరారయ్యారని తెలిపారు.


By August 17, 2020 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-police-officer-and-two-crpf-soldiers-have-lost-their-lives-after-terrorists-fire-in-kashmir/articleshow/77585254.cms

No comments