Breaking News

Hyderabad: మత్తు మందిచ్చి బాలికపై రేప్.. రాజకీయ నేత కొడుకు అరాచకం


హైదరాబాద్‌లోని కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు ఆమెను లోబరుచుకుని అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నేత కుమారుడైన రోహన్ బోనాల ఉత్సవంలో ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. Also Read: ఓ రోజు ఆమెను తన గదికి రప్పించి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించాడు. మత్తులోకి జారుకున్నాక ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు నుంచి తేరుకున్నాక బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే అంతు చూస్తానన్నాడు. కొద్దిరోజుల తర్వాత బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: ఈ విషయం తెలుసుకున్న రోహన్ బాధిత కుటుంబాన్ని బెదిరించాడు. కేసు వాపసు తీసుకోకపోతే అందరినీ చంపేస్తానన్నాడు. దీంతో ఆ కుటుంబం మరోసారి పోలీసులను ఆశ్రయించింది. రోహన్‌ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By August 21, 2020 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/political-leader-son-raped-minor-girl-in-hyderabad/articleshow/77668600.cms

No comments