Breaking News

మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఉపాధి కోల్పోయినవారికి మూడు నెలలు సగం జీతం


కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చింది. మూడు నెలల పాటు వారి సగటు వేతనంలో 50శాతాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ నేతృత్వంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ) బోర్డు గురువారం సాయంత్రం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఈఎస్ఐసీలో ఇప్పటికే సభ్యులుగా ఉన్న కార్మికులు తాజా ఆర్థిక సాయం పొందడానికి అర్హులు. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 41 లక్షల మంది కార్మికులకు దీని వల్ల లబ్ధి చేకూరనుంది. సమయంలో మార్చి 24 నుంచి ఉపాధి కోల్పోయిన, డిసెంబరు 31 వరకు ఉపాధి కోల్పోయే వారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే, 2018 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఈఎస్ఐసీ పథకంలో చేరి కనీసం రెండేళ్లు అయి ఉండాలి. 2019 అక్టోబర్ 1 నుంచి 2020 మార్చి 31 మధ్య కాలంలో కనీసం 78 రోజులు జమచేసినవారు అర్హులు. రూ. 21 వేలలోపు వేతనంతో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఈఎస్ఐసీలో లబ్ధి పొందుతారు. ఈ పథకంలో భాగంగా ప్రతినెలా కార్మికుల మూల వేతనంలో 0.75 మొత్తాన్ని జమ చేస్తుండగా.. దీనికి యాజమాన్యాలు అదనంగా 3.25 శాతం జమచేస్తాయి. వైద్య అవసరాలు, ఔషధాల కోసం ఈ సొమ్మును ఉపయోగించుకోవచ్చు. కార్మికులు తమ యాజమాన్యాల ద్వారా కాకుండా.. నేరుగా ఈఎస్ఐసీ కేంద్రాల్లోనే వీటిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. లాక్‌డౌన్ కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించిపోవడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరిని ఆదుకోడానికి ఈఎస్ఐసీ నిబంధనలు సడలించాలని నీతి-ఆయోగ్, కేంద్ర ఆర్ధిక శాఖ రెండు నెలల కిందట సిఫార్సు చేశాయి. ఈఎస్ఐసీ బోర్డు సభ్యుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడైన వి రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన 30-35 లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ పథకం కింద, గతంలో రోజుకు సగటు సంపాదనలో 25 శాతం షరతులకు లోబడి జీవితకాలంలో ఒకసారి గరిష్టంగా 90 రోజుల వరకు చెల్లించేవారు... ఇది ఇప్పుడు 50 శాతానికి పెంచారు.


By August 21, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-eased-norms-to-offer-50-of-salary-for-three-months-as-unemployment-allowance/articleshow/77668169.cms

No comments