Breaking News

ఇళయరాజా అరాచకాలు మితిమీరుత్తున్నాయి.. చెప్పక తప్పడంలేదు.. టాలీవుడ్ నిర్మాత షాకింగ్ కామెంట్స్


సంగీత దిగ్గజం ఇళయరాజాపై సంచలన కామెంట్స్ చేశారు టాలీవుడ్ నిర్మాత . ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై సంగీత దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇళయరాజా అరాచకాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తమిళనాడులో ఉన్న ఒక తెలుగు వాడిగా, తెలుగు చలన చిత్ర నిర్మాతగా.. ఓ పొజీషన్‌లో ఉన్న ఆయన గురించి ఇలా అనకూడదు కానీ, ప్రత్యక్షంగా చూశాను కాబట్టి అనక తప్పడం లేదంటూ ఓపెన్ అయ్యారు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్. ప్ర‌సాద్ స్టూడియోస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్వీ ప్ర‌సాద్ తనపై గౌర‌వంతో స్టూడియోలో ఓ గది బహుమతిగా ఇచ్చారని, గత 40 సంవత్సరాలుగా ఆయనిచ్చిన ఆ రికార్డింగ్ స్టూడియోలోనే తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని.. అయితే ఇప్పుడు ఎల్వీ ప్ర‌సాద్ మనవడు సాయి ప్రసాద్ మాత్రం దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంటూ పోలీస్ కేసు పెట్టారు ఇళయరాజా. దీంతో ఈ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఇష్యూపై రియాక్ట్ అయిన సీనియర్ నిర్మాత కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ చాలా విషయాలను ప్రస్తావించారు. ''సినిమా అంటే ఒక ఫ్యాషన్‌తో ఆ రోజుల్లో ఎన్నో కష్టాలుపడి ఎల్వీ ప్ర‌సాద్ గారు స్టూడియో కట్టారని, అప్పట్లో ఇళయరాజాకు డిమాండ్ ఉండటంతో ఆయన కోసం ప్రత్యేకంగా ఈ స్టూడియోలో ఓ గది, కపోజింగ్ రూమ్ ఇచ్చారు.. అంతమాత్రాన దానితో ఇళయరాజా గారికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఇళయరాజా లాంటి ఓ లెజెండ్ ఆ రికార్డింగ్ థియేటర్ నాది అని కేసు పెట్టడం సరికాదు. ఇది అన్యాయం కూడా. ఆయ‌న ఎవ‌రి మాట విని చేస్తున్నారో తెలియ‌డం లేదు. కానీ ఆయ‌న‌లాంటి వ్య‌క్తి ఇలాంటి ప‌నులు చేయ‌డం బాధాక‌రం. ఇప్ప‌టికైనా కేసును వెన‌క్కి తీసుకుంటే మంచిది'' అని తెలిపారు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్. Also Read: ఓ సినిమాకు పాట కంపోజ్ చేసినపుడు దాని సర్వహక్కులు ప్రతీ రూపాయి ఖర్చు పెట్టిన నిర్మాతకే ఉంటాయి.. కానీ ఇళయరాజా మాత్రం అలా కాకుండా తన పాటలు బయట ఎవరు పాడినా కూడా కేసులు వేస్తుంటారని, అప్పట్లో ఎస్పీ బాలుతో ఇలాంటి విభేదాలే సృష్టించుకున్నారంటూ అప్పటి విషయాలు కూడా చెప్పారు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్.


By August 03, 2020 at 10:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-producer-katragadda-prasad-open-comments-on-ilaiyaraaja/articleshow/77325916.cms

No comments