Breaking News

నాగచైతన్య అంటే ఇష్టం ఆ కోరిక తీరితే చాలు.. సమంత ఫీలైతే నాకేంటి? జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్


బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో ఎంతోమంది కళాకారులకు లైఫ్ ఇచ్చి వారిని ఫేమస్ చేసేసింది. జబర్దస్త్ పంచులతో రెచ్చిపోతున్న కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులకు ఇస్తున్న వినోదాల విందు అంతకంతకూ రెట్టింపవుతోంది. సరికొత్త గెటప్స్, స్కిట్స్ వేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో లేడీ గెటప్స్ వేసుకొని ఆడవాళ్ళుగా అలరించిన కమెడియన్స్ అమితంగా పాపులారిటీ కూడగట్టుకున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లేడీ కమెడియన్ వినోదిని పలువురు కమెడియన్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూ ఆసక్తికర విషయాలు రాబడుతోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ (ప్రియాంక) తన మనసులో ఉన్న విషయాలు, సీక్రెట్స్ వెల్లడిస్తూ తెగ సిగ్గుపడింది. లేడీ గెటప్పులో బుల్లితెరపై వినోదాలు పంచిన సాయి తేజ.. ఇప్పుడు ప్రియాంకగా మారి పోయాడు. అంటే ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా రూపాంతరం చెందాడు. అప్పట్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో యంగ్ హీరో నాగచైతన్యపై ఆమె చూపిన ఇంట్రెస్ట్ జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్వరలోనే తనను జీరో సైజ్‌లో చూస్తారని చెప్పిన ప్రియాంక.. గుడ్ మోడల్‌లా ఎదగాలనేదే తన డ్రీమ్ అని చెప్పింది. తనకు కన్నడ చిత్రసీమలో ఉన్న పరిచయాలతో తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నాని తెలిపింది. ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్నానని, ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో అదృష్టం తలుపుతడుతుందో తెలియదని చెప్పింది. Also Read: అయితే.. 'మీకు హీరోయిన్‌గా అవకాశం వస్తే మీ పక్కన ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు?' అని వినోదిని ప్రశ్నించగా.. సిగ్గు మొగ్గలేస్తూ నాగచైతన్య, నాని అని చెప్పింది ప్రియాంక. అంతటితో ఆగక తనకు అంటే చాలా ఇష్టమంటూ మెలికలు తిరిగిపోయింది. మరి ఫీల్ కాదా? అని వినోదిని ప్రశ్నించగా.. కానీ నాకేంటి? నేను చేసేది మూవీనే కదా! అని చెప్పింది ప్రియాంక. సో.. చూడాలి మరి ఈ జబర్దస్త్ బ్యూటీ ప్రియాంక (పింకీ) కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!.


By August 01, 2020 at 10:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jabardasth-fame-sai-teja-expressed-her-intrest-on-naga-chaitanya/articleshow/77297450.cms

No comments