రిటైర్డ్ ఏఎస్ఐని కొట్టి చంపిన రౌడీషీటర్.. ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. ఇంటి ముందు గొడవ చేయొద్దని మందలించినందుకు ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. రిటైర్డ్ ఏఎస్ఐని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మండలం తోటవారిపాలెం గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉండే సురేంద్ర అనే వ్యక్తిపై రౌడీషీట్ ఉంది. రోజూ రాత్రిళ్లు మద్యం తాగొచ్చి నివాసాల మధ్య అసభ్య పదజాలంతో మాట్లాడుతూ స్థానికులను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఏఎస్ఐగా పనిచేసి రిటైర్ అయిన సుద్దనగుంట నాగేశ్వరరావు అదే ప్రాంతంలో నివాసముంటున్నారు. Also Read: శుక్రవారం రాత్రివేళ సురేంద్ర మద్య మత్తులో గొడవ చేస్తుండటంతో నాగేశ్వరరావు మందలించారు. తమ ఇంటి ముందు గొడవ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనను మనసులో పెట్టుకున్న సురేంద్ర అదేరోజు అర్ధరాత్రి వేళ నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడి ఆయన్ని కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. ఆయన కేకలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు వచ్చేసరిని నిందితుడు పరారయ్యాడు. Also Read: తలకు తీవ్ర గాయం కావడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చీరాల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు సురేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:
By August 23, 2020 at 09:54AM
No comments