కర్నూలు: రెచ్చిపోయిన గ్రామ వాలంటీర్.. పక్కింటి మహిళపై హత్యాయత్నం

జిల్లా కొత్తపల్లి మండలంలో గ్రామ వాలంటీర్ రెచ్చిపోయాడు. మహిళపై కర్రతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టాడు. కొత్తపల్లి మండలంలోని కొక్కెరంచ గ్రామంలో జయప్రకాశ్‌రెడ్డి అనే వ్యక్తి వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. వారింటి పక్కనే సరోజమ్మ అనే మహిళ నివాసముంటోంది. బుధవారం ఏదో విషయమై జయప్రకాష్‌రెడ్డి, సరోజమ్మ కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. Also Read: ఈ విషయం తెలుసుకున్న జయప్రకాశ్‌రెడ్డి వెంటనే ఇంటికి చేరుకుని సరోజమ్మపై కర్రతో దాడి చేశాడు. ఆమె తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు జయప్రకాష్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By August 20, 2020 at 09:25AM
No comments