Breaking News

ప్రాణం తీసిన పాత గొడవ.. హైదరాబాద్‌లో యువకుడి దారుణహత్య


పాత కక్షలు ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్న ఘటన హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. చాదర్‌ఘాట్‌ మూసానగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ సాజిద్‌(25) కూలీ పనులు చేస్తుంటాడు. ఇతనిపై అనేక స్టేషన్లలో పిక్‌ పాకెటింగ్‌ కేసులున్నాయి. తన స్నేహితులు అబ్దుల్‌ ఖాదర్‌, ఫయాజ్‌లతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి ఆజంపురా చమన్‌ రైలుపట్టాల సమీపంలో ఓ విషయమై అబ్దుల్‌ ఖాదర్‌, ఫయాజ్‌లు గొడవ పడుతున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సాజిద్ జోక్యం చేసుకున్నాడు. Also Read: అప్పటికే పాత గొడవలను మనసులో పెట్టుకున్న ఖాదర్.. సాజిద్‌‌ను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యాడు. బాధితుడి కేకలు విన్న స్థానికులు చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న సాజిద్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి తల్లి సుల్తానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఖాదర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. Also Read:


By August 10, 2020 at 09:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-brutally-murdered-in-hyderabad-accused-arrested/articleshow/77455148.cms

No comments