చిచ్చురేపిన అక్రమ సంబంధం.. భర్తపై కత్తిపీటతో దాడి చేసిన భార్య

భర్తపై అనుమానం పెంచుకున్న మహిళ అతడిపై కత్తిపీటతో దాడికి పాల్పడిన ఘటన జిల్లా జూపాడుబంగ్లా మండలంలో జరిగింది. పారుమంచాల గ్రామానికి చెందిన మాధవరం శివరాములు భార్య కరుణమ్మతో కలిసి జీవవిస్తున్నాడు. ఈ క్రమంలోనే శివరాములు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆమె అనుమానం పెంచుకుంది. దీనిపై తరుచూ భర్తను నిలదీస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. Also Read: మంగళవారం కూడా మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కరుణమ్మ కత్తిపీటతో భర్త తలపై కొట్టింది. బాధితులు కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని శివరాములును రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే భార్య దాడిలో శివరాములు మరణించాడని గ్రామంలో కొందరు వదంతులు సృష్టించారు. దీనిపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆయన బాగానే ఉన్నాడని, ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By August 19, 2020 at 09:07AM
No comments