గుంటూరు: పత్తి వ్యాపారంలో ముంచేసిన ఫ్రెండ్స్.. సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్

స్నేహితుల మాట విని పత్తి వ్యాపారం భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన ఓ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. గుంటూరు రాజేంద్రనగర్‌కు చెందిన రావిపాటి బసవ సుందరరావు (బసవయ్య) పలు ప్రైవేటు కంపెనీల్లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన బుధవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబసభ్యులు కాపాడి జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. Also Read: ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న ఆయన తనను స్నేహితులు ఎలా మోసం చేసిందీ వివరించారు. ‘నా స్నేహితులు రాపర్ల వెంకటేశ్వరరావు, పొన్నం శ్రీనివాసరావులు నాతో సుమారు రూ.2.5 కోట్లు పత్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి మోసగించారు. నేను నిజం తెలుసుకుని నిలదీస్తే తమకు రాజకీయ అండ ఉందని.. ఎస్పీ కూడా తెలుసని, తమనేమీ చేయలేవని పొన్నం శ్రీనివాసరావు నన్ను బెదిరించాడు. ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తే పట్టాభిపురం స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కడి పోలీసులు ఇకపై మీకు వారి నుంచి ఎలాంటి బెదిరింపులు ఉండవని చెప్పారే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారు చేసిన మోసానికి కుంగిపోయి, బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నా. నా మరణానికి కారకులపై కఠినచర్యలు తీసుకోవాలి. నా భార్యకు న్యాయం చేయండి’ అంటూ బసవయ్య ఎస్పీని వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. Also Read:
By August 21, 2020 at 08:36AM
No comments