గుంటూరు: రెండేళ్లకే నరకం చూపించిన భర్త.. పెళ్లి రోజే మహిళ ఆత్మహత్య

భర్త వేధింపుల తాళలేక పెళ్లి రోజే ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన జిల్లా కర్లపాలెం మండల పరిధిలో ఆదివారం జరిగింది. పెదగొల్లపాలెం పంచాయతీ యారంవారిపాలెంకు చెందిన యారం ముసలయ్యకు, బాపట్ల మండలం మూలపాలేనికి చెందిన రజని(21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆదివారం వీరి రెండో వివాహ వార్షికోత్సవం. అయితే కొంతకాలంగా భర్త తీవ్రంగా వేధిచండంతో రజనీ మనస్తాపానికి గురవుతూ వస్తోంది. ఆదివారం పెళ్లి రోజు అని కూడా చూడకుండా ఆమెను దుర్బాషలాడుతూ వేధించాడు. Also Read: దీంతో మనస్తాపానికి గురైన రజని గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమెన గమనించిన కుటుంబసభ్యులు బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. రజని బాబాయి మరియదాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి.. ఎస్ఐ శ్రీహరితో కలిసి సంఘటనా స్థలం పరిశీలించి వివరాలు సేకరించారు. Also Read:
By August 10, 2020 at 08:24AM
No comments