Breaking News

గాయపడిన ఆవు.. హెలికాప్టర్ రప్పించి తరలించిన రైతు


ఆవులను ప్రేమగా చూసుకుంటూ వాటికి బాధ కలిగితే కొందరు విలవిలాడిపోతారు. అయితే, ఓ రైతు ఎంతో అభిమానంగా పెంచుకుంటున్న ఆవు మేతకు వెళ్లి గాయపడిగా.. అది నడిస్తే ఇబ్బంది పడుతుందని ఏకంగా హెలికాప్టర్‌లోనే తరలించాడు. ఈ ఘటన స్విట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. గోమాతాపై ఆ రైతుకున్న ప్రేమే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ రైతుకి తన వద్ద ఉన్న ఆవు అంటే చాలా ఇష్టం. అది ఇబ్బందిపడితే ఆయన మనసు చివుక్కు మంటుంది. ఆల్ప్స్‌లోని ఓ పర్వతంలో నిర్వహించిన బోడెన్‌ఫహార్డ్ కార్యక్రమానికి తరలించిన ఆవు గాయపడి కుంటుతూ నడుస్తుండడాన్ని రైతు గమనించాడు. అది అలాగే నడుచుకుంటూ వెళ్తే మరింత ఇబ్బంది పడుతుందని భావించాడు. దీంతో వెంటనే ఆవును తరలించడానికి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయించాడు. సహాయక సిబ్బంది వచ్చి ఆవుకి తాళ్లు కట్టి హెలికాప్టర్‌ ద్వారా పైకి లేపి పర్వతాల్లోంచి బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయింది. ఆ రైతుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్విట్జర్లాండ్‌ ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లోని రైతులు ఏటా తమ పశువులను బోడెన్‌ఫహర్ట్ అనే కార్యక్రమంలో భాగంగా ఎత్తైన ప్రాంతం నుంచి దిగువ ఆల్ప్స్ వరకు నడుపుతారు. ఇందులో భాగంగా క్లాసేన్ పాస్ వద్ద సుమారు 1,000 ఆవులను కొండలపైకి తీసుకువచ్చారు.. కానీ ఓ రైతుకు చెందిన ఆవు గాయపడటంతో హెలికాప్టర్ ద్వారా కిందికి దింపారు. అంబ్రోస్ ఆర్నాల్డ్ అనే రైతు మాట్లాడుతూ.. ఆవును తరలించడానికి ఇది సమర్థవంతమైందని అన్నారు. అయితే, అకస్మాత్తుగా గాలిలోకి లేపవడం వల్ల గోవుకి కొంత ఇబ్బందిగా ఉండవచ్చన్నారు. భవిష్యత్తులో గాయపడిన ఆవులను ఇదే విధానంలో తరలించడానికి ప్రయత్నిస్తామని అన్నారు.


By August 21, 2020 at 07:04AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/injured-cow-is-lifted-with-helicopter-and-preventing-it-from-making-the-journey-in-switzerland/articleshow/77665998.cms

No comments