ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. విశాఖలో దారుణం

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కిరాతకంగా చంపేసింది. పాయకరావుపేట మండలం ఈదటము గ్రామంలో పెదవీరబాబు అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అతడి భార్య కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వ్యక్తితో కొనసాగిస్తోంది. Also Read: ఈ విషయం తెలుసుకున్న పెదవీరబాబు పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని ఆమె కక్ష పెంచుకుంది. అతడిని అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో రోజూ రాసలీలలు కొనసాగించవచ్చని అనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పడంతో అతడూ సరేనన్నాడు. గురువారం రాత్రి నిద్రపోతున్న పెదవీరబాబు తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్టు అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By August 21, 2020 at 07:13AM
No comments