Breaking News

అదో రకం... ఇదో రకం... హాంగ్‌కాంగ్ యువకుడికి రెండోసారి కరోనా


బారిన పడిన వ్యక్తులు కోలుకున్న తర్వాత మళ్లీ ఈ మహమ్మారి బారిన పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్‌కు చెందిన పరిశోధకులు ఇలాంటి కేసును గుర్తించారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన 33 ఏళ్ల ఓ యువకుడు ఆగష్టు నెలలో స్పెయిన్ వెళ్లొచ్చాడు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ చేయగా అతడికి పాజిటివ్ అని తేలింది. అతడు మార్చి నెలలోనే తొలిసారి కోవిడ్ బారిన పడ్డాడని డాక్టర్ కెల్విన్ కై వాంగ్ తో అనే మైక్రోబయాలజిస్ట్ తెలిపారు. మార్చి నెలలో కరోనా సోకినప్పుడు అతడిలో స్వల్ప లక్షణాలు కనిపించాయి. కానీ రెండోసారి మాత్రం ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. జన్యు పరీక్షలు చేయగా.. తొలిసారి అతడికి సోకిందని ఒక రకం కరోనా వైరస్ కాగా.. రెండోసారి మరో రకమని తేలింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇమ్యూనిటీ జీవిత కాలం ఉండదనడానికి ఇది నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా ఎంత మంది రెండోసారి కరోనా బారిన పడుతున్నారో మనకు తెలీదన్నారు. ఓసారి కరోనా బారిన పడిన వ్యక్తికి మరోసారి వైరస్ సోకినప్పటికీ.. తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా వారిలో రోగనిరోధక శక్తి ఉందో లేదో తెలీదన్నారు. కరోనా సోకి తగ్గిన వారు.. తమకేం కాదులే అని నిర్లక్ష్యంగా ఉండకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ... మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం లాంటివి చేయాలని పరిశోధకులు సూచించారు. ఎవరైనా రెండోసారి ఇన్ఫెక్షన్ బారిన పడితే.. ఆరోగ్యం క్షీణించకుండా రోగ నిరోధక శక్తి కాపాడుతుంది. కానీ రోగనిరోధక శక్తి బలహీన పడితే.. వ్యాక్సిన్లకు కూడా ఇది ఛాలెంజింగ్‌గా మారుతుందని జార్జ్ టౌన్ యూనివర్సిటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జెస్సీ గుడ్‌మన్ తెలిపారు. కానీ రెండోసారి కోవిడ్ బారిన హాంగ్‌కాంగ్ యువకుడిలో లక్షణాలు కనిపించకపోవడాన్ని బట్టి.. వైరస్ పెద్దగా ప్రభావం చూపడం లేదని భావించొచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కానీ వారి నుంచి ఇతరులకు సోకే ముప్పు ఉందన్నారు.


By August 25, 2020 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/honkong-man-who-returns-from-spain-gets-coronavirus-second-time/articleshow/77734366.cms

No comments