డాక్టర్ మాధవీలత ఆత్మహత్యపై అనుమానాలు.. సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు!

జిల్లా నంద్యాలలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డెంటిస్ట్ మాధవీలత కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబం, ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేని ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. మాధవీలత రాసిన సూసైడ్ నోట్‌లోని విషయాలను పోలీసులు బయటపెట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. Also Read: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణ కిశోర్, గుంటూరుకు చెందిన మాధవీలత(47) 20ఏళ్ల క్రితం మెడిసిన్ చదుకునే సమయంలోనే ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరు నంద్యాలలోని శ్రీనివాస సెంటర్‌లో శ్రీరమణ కాస్మొటిక్ పేరుతో దంత వైద్యశాలను నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు కూడా మెడిసిన్ చదువుతున్నాడు. ఈ నెల 16వ తేదీన మాధవీలత ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. తన కూతురు భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉండేదని మృతురాలి తండ్రి పోలీసులకు చెబుతుండటంతో పోలీసులు భర్తపై అనుమానం వ్యక్తం చేయడం లేదు. Also Read: వీరి కుటుంబం సొంతంగా ఆస్పత్రి నిర్వహిస్తుండటంతో ఆర్థికంగానూ ఎలాంటి ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె ఎందుకు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందన్నది మిస్టరీగా మారింది. సంఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న టూటౌన్ సీఐ కంబగిరిరాముడు అందులో ఏముందో ఇంతవరకు బయట పెట్టలేదు. సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు ఉన్నాయని, వాటిని బయటపెడితే కేసు నీరుగార్చే అవకాశం ఉన్న కారణంగానే పోలీసులు దాన్ని రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. Also Read:
By August 25, 2020 at 10:26AM
No comments