Breaking News

అమ్మాయిల పిచ్చే ప్రాణం తీసింది.. నెల్లూరు డాక్టర్‌ మృతిపై వీడిన మిస్టరీ


జిల్లా రాపూరులోని కరుణామయి ఆసుపత్రి డాక్టర్‌ రవీంద్రనాయక్‌(26) మృతిపై మిస్టరీని పోలీసులు చేధించారు. హాస్పిటల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసే అంకయ్యే డాక్టర్‌ను చంపి దహనం చేసినట్లు గుర్తించారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలతో పాటు అమ్మాయిలతో అక్రమ సంబంధాల విషయంలో తలెత్తిన వివాదాలే హత్యకు కారణంగా నిర్ధారించారు. ఈ కేసు వివరాలను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విభాగం నెల్లూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. Also Read: అనంతపురం జిల్లా కొండూరు మండలం ఉడివితాండ గ్రామానికి చెందిన రవీంద్రనాయక్‌ కొంతకాలంగా కరుణామయి ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. మే 14 నుంచి ఆయన కనిపించడం లేదని సోదరుడు తిప్పన్ననాయక్‌ ఇటీవల రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవీంద్రనాయక్‌కు, ఆస్పత్రి వాచ్‌మెన్‌ అంకయ్యకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని విచారణలో వెల్లడైంది. దీనికి తోడు రవీంద్రనాయక్‌ అప్పుడప్పుడు లైంగిక సుఖం కోసం అంకయ్య ద్వారా అమ్మాయిలను రప్పించుకునే వాడని తెలిసింది. దీంతో పోలీసులు అంకయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. Also Read: మే నెలలో రవీంద్రనాయక్‌ పుట్టినరోజు రావడంతో ఆసుపత్రి సిబ్బంది అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం డాక్టర్, వాచ్‌మెన్‌ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడంతో వాచ్‌మెన్‌ అంకయ్య బీరు సీసాతో రవీంద్ర నాయక్ తలపై కొట్టి చంపేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా రాపూరు, గూడూరు మార్గంలోని తెలుగుగంగ కాలువ వద్ద మృతదేహంపై పెట్రోలు పోసి దహనం చేశాడు. నిందితుడు అంకయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. అయితే రవీంద్ర నాయక్ హత్య వెనుక హాస్పిటల్ యాజమాన్యంతో పాటు మరికొందరి పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. Also Read:


By August 06, 2020 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-doctor-murder-case-solved-by-nellore-police-watchman-arrested/articleshow/77384157.cms

No comments