Breaking News

ప్రియుడి మోజులో పడిన వివాహిత.. అర్ధరాత్రి భర్త దారుణ హత్య


అక్రమ సంబంధానికి ఓ అమాయకుడి ప్రాణం బలైపోయింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో జరిగింది. ఈదటం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన గంపల పెదవీరబాబు భార్య మరియాతో కలిసి ఉంటున్నాడు. అద్దరిపేటకు చెందిన నేమాల రమణతో మరియాకు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. Also Read: ఈ విషయం తెలుసుకున్న వీరబాబు భార్యను తరుచూ నిలదీసేశాడు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. పెద్దలతో పంచాయతీ పెట్టినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని మరియా నిర్ణయించుకుంది. ఈ నెల 18వ తేదీ రాత్రి భర్త నిద్రపోతుండగా ప్రియుడిని ఇంటికి రప్పించింది. పెదవీరబాబు తలపై రమణ ఇనుప రాడ్‌తో కొట్టి పారిపోయాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మరియాను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్టు అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను నక్కపల్లి సీఐ విజయ్‌కుమార్ శుక్రవారం మీడియాకు వివరించారు. Also Read:


By August 29, 2020 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-kills-husband-in-vizag-district-with-help-of-boyfriend/articleshow/77815972.cms

No comments