హైదరాబాద్: బంగ్లా అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు

ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా భారత్‌లోకి తీసుకొచ్చి బలవంతంగా చేయిస్తున్న ముఠాపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆరుగురిని నిందితులుగా గుర్తించిన ఎన్ఐఏ వారికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను సేకరించి ఛార్జిషీటుగా పొందుపరిచింది. ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చిన ఈ ముఠా వారిని బెదిరించి బలవంతంగా వ్యభిచారం కూపంలోకి నెట్టింది. రోజూ విటులను తీసుకొచ్చి వారికి లైంగిక సుఖం అందించకపోతే చంపేస్తామని బెదిరించేవారు. Also Read: ఈ చీకటి వ్యాపారంపై 2019లో హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో సంచలనం రేపింది. దీంతో పోలీసులు వ్యభిచార కేంద్రాలపై దాడులు చేసి బంగ్లాదేశ్ యువతులను రక్షించారు. ఉద్యోగాల పేరుతో తమను ఇక్కడికి తీసుకొచ్చిన ముఠా సభ్యులు పాస్‌పోర్టులు లాక్కుని బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు యువతులు పోలీసులకు చెప్పారు. Also Read: దీంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది మానవ వ్యవహారంగా గుర్తించిన ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ కేసును తానే స్వయంగా దర్యాప్తు చేపట్టింది. అన్ని ఆధారాలు సేకరించిన అధికారులు తాజాగా న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. Also Read:
By August 21, 2020 at 08:19AM
No comments