భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. ‘పశ్చిమ’లో విషాదం

నిండునూరేళ్లు కలిసి జీవించాలనుకున్న భార్య చనిపోవడంతో ఆ భర్త తట్టుకోలేకపోయాడు. ఆమె లేని ఈ లోకంలో తాను కూడా ఉండలేననుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయాడు. ఈ విషాదకర ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలంలో జరిగింది. బొర్రంపాలెం గ్రామానికి చెందిన చింతలపూడి వెంకటేష్ (26)కు ఉష అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వెంకటేష్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. Also Read: మూడు నెలల క్రితం యాక్సిడెంట్‌కు గురికావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన ఉషను ఆమె తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్న వెంకటేష్ బుధవారం రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు సూర్యచంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ఆసుపత్రికి తరలించారు. నెల రోజుల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. Also Read:
By August 21, 2020 at 07:37AM
No comments