Breaking News

కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు


కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కన్నకూతురిపైనే రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న నీచపు ఘటన ఇది. ఆ కామాంధుడి చేతిలో నరకం చవిచూస్తున్న బాలిక తెలిసీ తెలియని వయసులోనే గర్భం దాల్చి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన రాజధాని నగరంలో వెలుగుచూసింది. Also Read: నగరంలోని పంత్ నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక రాజావాడీ ఆసుపత్రిలో రెండ్రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మైనరని గుర్తించిన డాక్టర్లు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని ప్రశ్నించగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 2018, మార్చి నుంచి కన్నతండ్రే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదరించాడని తెలిపింది. Also Read: తాను గర్భం దాల్చినా కూడా విడిచిపెట్టకుండా తండ్రి లైంగిక దాడికి పాల్పడేవాడని బాధితురాలు చెప్పింది. దీంతో ఆ నీచుడిపై ఐపీసీ 376, సెక్షన్ 4,6,8,10,12 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూతురినే తల్లిని చేసిన ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By August 26, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/father-raping-minor-daughter-for-two-years-in-mumbai/articleshow/77755539.cms

No comments