Breaking News

స్నేహితులు కాదు కీచకులు.. నమ్మి వచ్చిన బాలికపై ఆరుగురు కలిసి రేప్


స్నేహితులని నమ్మి యువకులతో వెళ్లిన మైనర్ బాలిక వారి చేతిలో చిక్కుకుని నరకం అనుభవించింది. ఆరు మానవ మృగాలు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు దాన్ని వీడియో తీసి పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రా నగరంలో జరిగింది. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని నిందితులు బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. Also Read: ఇటీవల నిందితుల్లో ఒకడు ఆ వీడియోను బాధితురాలికి పంపించి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాలిక ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితులపై ఐపీసీ 376 డి, 354, 34 సెక్షన్లతో పాటు పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By August 05, 2020 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-raped-by-6-friends-in-himachal-pradesh/articleshow/77365097.cms

No comments